ఆదివారం 29 మార్చి 2020
International - Mar 20, 2020 , 18:49:04

జకర్తాలో రెండు వారాలు ఎమర్జెన్సీ..

జకర్తాలో రెండు వారాలు ఎమర్జెన్సీ..

జకర్తా: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)నేపథ్యంలో ఇండోనేషియా రాజధాని నగరం జకార్తాలో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. కరోనా ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెండు వారాలపాటు ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎమర్జెన్సీ నిర్ణయంతో జకార్తాలో ప్రజా వినోద కార్యక్రమాలు , సినిమా థియేటర్లు, మాల్స్‌ బంద్‌ కానున్నట్లు గవర్నర్‌ అనీష్‌ బస్వేడాన్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ప్రజా రవాణా విభాగానికి సంబంధించి పరిమితస్తాయిలో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రైవేట్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం సౌకర్యానిన కల్పించాలని గవర్నర్‌ అనీష్‌ బస్వేడాన్‌ కోరారు. ఇండోనేషియాలో మూడు వారాల సమయంలో 309 కరోనా కేసులు నమోదవగా..25 మంది మృతి చెందారు. 


logo