గురువారం 04 జూన్ 2020
International - Apr 15, 2020 , 11:53:05

రిసార్ట్, స్పా సెంట‌ర్ వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మైన చిరుత‌..వీడియో

రిసార్ట్, స్పా సెంట‌ర్ వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మైన చిరుత‌..వీడియో

మెక్సికో: క‌రోనాను నియంత్రించేందుకు ప్రపంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్ డౌన్ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్‌తో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, రిసార్టులు, పార్కులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో అట‌వీ ప్రాంతంలో ఉండే జంతువులు రోడ్ల‌పైకి, జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి.

 మెక్సికో లోని తులుమ్ వీధుల్లో ఉన్న గ్రాండ్ సిరెనిస్ రివీరా మయా రిసార్ట్స్, స్పా  సెంట‌ర్ కు స‌మీపంలోకి చిరుత‌ ప్ర‌వేశించింది. రిసార్ట్స్ లో ఉన్న‌వారు  చిరుత‌ను వీడియో తీసి ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.  ఇటీవ‌లే  లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా అరుదైన‌ పునుగు పిల్లి ఒక‌టి అట‌వీ ప్రాంతంలో నుంచి కేర‌ళ రోడ్ల‌పై సంచ‌రిస్తూ క‌నిపించింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo