బుధవారం 24 ఫిబ్రవరి 2021
International - Jan 20, 2021 , 10:49:08

బిలియ‌నీర్ జాక్‌మా క‌నిపించారు..

బిలియ‌నీర్ జాక్‌మా క‌నిపించారు..

బీజింగ్‌:  చైనా కంపెనీ అలీబాబా వ్య‌వ‌స్థాప‌కుడు,  బిలియ‌నీర్ జాక్‌మా క‌నిపించారు.  గ‌త కొన్ని నెల‌ల నుంచి ఆయ‌న ఆచూకీ లేని విష‌యం తెలిసిందే.  చైనా ప్ర‌భుత్వంతో ఇటీవ‌ల జాక్ మా వైరానికి దిగిన‌ట్లు తెలిసింది. ఆ క్ష‌ణం నుంచి ఆయ‌న అదృశ్యం అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.  అయితే బుధ‌వారం జ‌రిగిన ఆన్‌లైన్ కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న టీచ‌ర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం  చేశారు.  గ్రామీణ స్థాయిలో విద్యావృత్తి చేప‌డుతున్న టీచ‌ర్ల‌ను ఆయ‌న  మెచ్చుకున్నారు.   గ‌త ఏడాది న‌వంబ‌ర్ నుంచి బిలియ‌నీర్ జాక్ మా అదృశ్యం అయ్యారు. ఆయ‌న‌కు చెందిన యాంట్ గ్రూపుపై చైనా ప్ర‌భుత్వం ఆగ్ర‌హంగా ఉంది. ఆ కంపెనీ ఐపీవోల‌ను చైనా ప్ర‌భుత్వం అడ్డుకున్న‌ది. ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌తం చేసింది.  అలీబాబా సంస్థపై కూడా చైనా ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్టింది.  చైనాలో ప్ర‌భుత్వ ఆంక్ష‌లు ఎక్కువ ఉన్నాయ‌ని జాక్ మా ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో స్థానిక ప్ర‌భుత్వం ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  గ‌తంలో ఇంగ్లీష్ పాఠాలు బోధించే జాక్ మా.. ఆ త‌ర్వాత అలీబాబా సంస్థ‌ను స్థాపించారు.  ప్ర‌తి ఏడాది ఆయ‌న గ్రామీణ టీచ‌ర్ల‌కు క్లాసులు తీసుకుంటారు.   

VIDEOS

logo