శనివారం 30 మే 2020
International - May 20, 2020 , 17:44:52

అమెరికా, కెనడాల్లో పౌడర్ అమ్మకాలు నిలిపివేసిన జాన్సన్ అండ్ జాన్సన్

అమెరికా, కెనడాల్లో పౌడర్ అమ్మకాలు నిలిపివేసిన జాన్సన్ అండ్ జాన్సన్

వాషింగ్టన్: ఆరోగ్య భద్రతపై కోర్టుల్లో భారీసంఖ్యలో కేసులు ఎదుర్కొంటున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అమెరికా, కెనడాల్లో బేబీ టాల్క్ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది. క్యాన్సర్ కలిగించే అస్బెస్టాస్ ఆ పౌడర్ లో కలవడం వల్ల అనేకమంది అనారోగ్యం పాలయ్యారని అమెరికాలోని కోర్టుల్లో 19 వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. తప్పుడు ప్రచారం వల్ల అమ్మకాలు నిలిపేవేయాల్సి వచ్చిందని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలిపింది. తమ ఉత్పత్తులు దశాబ్దాల పరిశోధనలో రాటుదేలాయని పేర్కొన్నది. కంపెనీపై వేసిన కాంగ్రెస్ కమిటీకి నాయకత్వం వహించిన ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పౌడర్ అమ్మకాల నిలిపివేత ప్రజారోగ్యానికి ఘనవిజయమని అభివర్ణించారు. తన ఉపసంఘం జరిపిన 14 మాసాల దర్యాప్తులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి తన ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ కలుస్తున్న సంగతి ముందు నుంచీ తెలుసునని రుజువైందని అన్నారు. 1894 నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అవుతున్నాయి.


logo