శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 19, 2020 , 18:17:09

స్విట్జర్లాండ్‌లో కోకోవా మంచు..!

స్విట్జర్లాండ్‌లో కోకోవా మంచు..!

ఓల్టెన్ : స్విట్జర్లాండ్‌లో ఉన్నట్టుండి కోకోవా (చాక్లెట్‌ తయారీకి వాడే కోకోబీన్స్‌) మంచు కురిసింది. దీన్ని చూసి స్విస్‌ పట్టణవాసులు ఆశ్చర్యపోయారు. అయితే, ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో వెంటిలేషన్ వ్యవస్థ పనిచేయకపోవడంతో కోకోవా మంచు కురవడం మొదలైందట. 

జూరిచ్, బాసెల్ మధ్య ఓల్టెన్‌లోని తమ కర్మాగారంలో కాల్చిన ‘కోకో నిబ్స్’ శీతలీకరణ వెంటిలేషన్‌లో స్వల్ప లోపం ఉందని లిండ్ట్  అండ్‌ స్ప్రూయంగ్లీ సంస్థ ధ్రువీకరించింది. కోకో పౌడర్ బలమైన గాలులతో కలిసి సమీప ప్రాంతాల్లో వ్యాపించిందని తెలిపింది. ఒక కారుపై కోకో పౌడర్‌ పూత ఏర్పడిందని, దాన్ని తామే బాగుచేయిస్తామని సదరు యజమానికి తెలిపామని పేర్కొంది. ఈ కోకో కణాలు ప్రజలు, పర్యావరణానికి పూర్తిగా ప్రమాదకరం కాదని వెల్లడించింది. వెంటిలేషన్‌ వ్యవస్థకు మరమ్మతులు చేయించినట్లు తెలిపింది. 



logo