దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడారు. తన సతీమణి మెలానియాతో కలిసి శ్వేతసౌదం నుంచి మేరీల్యాండ్‌లోని మిలటరీ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. అక్కడ 21 గన్ సెల్యూట్ స్వీకరించి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కి ఫ్లోరిడాకు బయల్దేరివెళ్లారు. ఫ్లోరిడాలోని తన మార్ లాగో రిసార్టుకు వెళ్లే ముందు ఎయిర్ బేస్ వద్ద తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు, సిబ్బందిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడిగా ఉండటం తనకు లభించిన గొప్ప గౌరవం అన్నారు. నాలుగు సంవత్సరాలు నమ్మశక్యంగా కాకుండా గడిచాయన్నారు. ఈ సందర్భంగా తనకు తోడ్పాటునందించిన కుటుంబ సభ్యులు, మిత్రులు, సిబ్బందికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబం ఎంత కష్టపడిందో జనాలకు తెలియదన్నారు. ప్రపంచంలోనే గొప్ప దేశం అమెరికా అన్నారు. గొప్ప ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం అన్నారు. కొవిడ్ మహమ్మారి వల్ల చాలా ఇబ్బందులు పడ్డట్లు తెలిపారు. వైద్య చరిత్రలోనే అరుదైనదిగా పరిగణించేలా 9 నెలల్లోనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ఇది తన తాత్కాలిక వీడ్కోలు మాత్రమేనని దీర్ఘకాలిక వీడ్కోలు కాదని ట్రంప్ అన్నారు. ప్రజల కోసం తన పోరాటాన్ని కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఏదో ఒక రూపంలో మళ్లీ తిరిగొస్తామని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడనున్న పాలకవర్గానికి ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అద్భుతాలు సృష్టించేందుకు వారికి తగిన పునాది ఉందన్నారు.
తాజావార్తలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది
- ట్రాఫిక్ జరిమానా కోసం మంగళసూత్రం తీసిచ్చిన మహిళ
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన రోహిత్, అశ్విన్
- మార్చి లేదా ఏప్రిల్‌లో పెట్రోల్ ధరలు తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
- బ్రెజిల్ ప్రధానికి ప్రధాని మోదీ అభినందనలు
- మల్లయోధుల బృందాన్ని సత్కరించిన పవన్ కళ్యాణ్
- ముంచుకొస్తున్న అంటార్కిటికా ముప్పు.. మంచు కొండలో పగుళ్లు.. వీడియో
- కాస్త స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు!