శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 14:02:58

మ‌హిళ నిద్ర‌పోతున్న వేళ‌.. నుదిటి మీద కాటేసిన పాము!

మ‌హిళ నిద్ర‌పోతున్న వేళ‌.. నుదిటి మీద కాటేసిన పాము!

పాములు ఇంట్లోకి చొర‌బ‌డ‌ట‌‌మే కాదు. య‌జ‌మానుల‌కు ముద్దులు కూడా పెడుతున్నాయి. నిద్ర‌పోతున్న ఓ మ‌హిళ ఇంటికి పాము వెళ్ల‌డ‌మే కాకుండా ఆమె నుదుటి మీద క‌రిచింది. అప్పుడు స‌మ‌యం 2 గంట‌లు. ఈ సంఘ‌ట‌న ఆస్ట్రేలియాలోని కూల‌లింగాలో చోటు చేసుకున్న‌ది. ఎమిలీ హిండ్స్ అనే మహిళ మంగ‌ళ‌వారం ‘సోషల్ నెట్ బాల్’లో విజేతగా నిలిచినందుకు సెలబ్రేషన్‌లో మునిగి తేలింది. ఒక గ్లాస్ వైన్ కూడా తాగింది. మ‌ద్యం మ‌త్తులో అలానే నిద్ర‌పోయింది. స‌రిగ్గా 2 గంట‌ల స‌మ‌యంలో ముఖం మీద ఏదో తిరుగుతున్న‌ట్లు అనిపించింది ఆమెకు. గాలికి జుట్టు క‌ద‌ల‌డం, హెయిర్‌క్లిబ్ అయింటుందని అనుకుంటూనే ఉన్న‌ది కాని క‌ళ్లు తెర‌వ‌లేదు. కాసేప‌టికే ఆ పాము నుదిటిమీద కాటేసింది. దీంతో ఆ మ‌హిళ‌కు దెబ్బ‌కు మెల‌కువ వ‌చ్చింది.

లేచి చూసుకుంటే నుదుటిమీద గాట్లు ఉన్నాయి. ప‌క్క‌నే ఉన్న ఆమె భ‌ర్త‌ జాసన్‌‌ను నిద్ర‌లేపింది. అత‌ను పాము ఎక్క‌డుందో వెతికి గుర్తించాడు. పాము తోక ప‌ట్టుకుంటే జాస‌న్‌ను క‌ర‌వ‌బోయింది. దీంతో భార్య స‌ల‌హా మేర‌కు త‌ల భాగంలో ప‌ట్టుకొని పెర‌ట్లోకి పామును విసిరేశాడు. త‌ర్వాత రోజు ఆ పాము పెర‌ట్లో తిరుగుతున్న‌ట్లు క‌నిపించింద‌ని ఎమిలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంటి ఇలాంటి పాములు రావ‌డం సాధార‌ణ‌మే కాని ఇలా మ‌నిషిని కాటేయం ఇదే మొద‌టిసారి అంటున్న‌ది. ఈ పాము కొండ చిలువ జాతికి చెందిన కార్పెట్ పైథాన్ కావ‌డంతో విషం ఎక్క‌లేదు కాబ‌ట్టి స‌రిపోయింది. వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించి చికిత్స చేయించుకుంది. 


 logo