శనివారం 30 మే 2020
International - Apr 07, 2020 , 17:51:47

నేపాల్‌లో లాక్‌డౌన్ పర్యవేక్షణకు వచ్చిన ఖడ్గమృగం

నేపాల్‌లో లాక్‌డౌన్ పర్యవేక్షణకు వచ్చిన ఖడ్గమృగం

హైదరాబాద్: కేరళలో ఓ అడవి ఏనుగు జనావాసాల్లోకి వచ్చి దర్జాగా చక్కర్లు కొట్టడం గుర్తుండే ఉంటుంది. లాక్‌డౌన్ పుణ్యమా అని వన్యప్రాణులు స్వేచ్ఛగా ఇళ్లమధ్యకు వచ్చి ఇలా సంచరించడం గురించి వివిధ ప్రాంతాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా పొరుగుదేశమైన నేపాల్‌లో ఓ ఖడ్గమృగం హల్‌చల్ చేసింది. చితవన్ జాతీయ ఉద్యానంలో ఈ ఘటన జరిగింది. అటవీశాఖ అధికారులు తీసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో ఖడ్గమృగం ఖాళీగా ఉన్న వీధుల్లో షికారు చేయడం కనిపిస్తుంది. మనుషులు అంతంత మాత్రంగా కనిపిస్తుంటారు. అలాఅలా అది వెళుతుండగా లాక్‌డౌన్ ఉల్లంఘించి తిరుగుతున్న ఓ మనిషి వీధుల్లో కనిపిస్తాడు. కాసేపు అతడిని తరుముతుంది. తర్వాత పోనీలే పాపం అనుకుని తన మానాన తాను పోతుంది. ఈ వీడియోకు 1.1 లక్షలకు పైగా వ్యూస్, 8,500 లైక్స్ వచ్చాయి.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">So this <a href="https://twitter.com/hashtag/rhino?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#rhino</a> thought to take things in his own hand. Went for an inspection. Btw rhino venturing out from forest happens a lot, even without lockdown. Forward. <a href="https://t.co/Ck1sft3Emb">pic.twitter.com/Ck1sft3Emb</a></p>&mdash; Parveen Kaswan, IFS (@ParveenKaswan) <a href="https://twitter.com/ParveenKaswan/status/1247080976330551298?ref_src=twsrc%5Etfw">April 6, 2020</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


logo