శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 07:48:30

వసుదైక కుటుంబానికి ఐటీఈఆర్‌ నిదర్శనం: ప్రధాని మోదీ

వసుదైక కుటుంబానికి ఐటీఈఆర్‌ నిదర్శనం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అనాదిగా భారత్‌ విశ్వసిస్తున్న వసుదైక కుటుంబమనే భావనకు ‘ఇంటర్నేషనల్‌ థర్మో న్యూక్లియర్‌ ఎక్సపరింమెంటల్‌ రియాక్టర్‌' (ఐటీఈఆర్‌) ప్రాజెక్ట్‌ నిదర్శనమని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్‌ డివైజ్‌ అయిన ఐటీఈఆర్‌ టోక్‌మక్‌  విడిభాగాలను మంగళవారం ఫ్రాన్స్‌లో అనుసంధానించడం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. ప్రధాని మోదీ సందేశాన్ని ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్‌ అష్రాఫ్‌ చదివి వినిపించారు. సూర్యుడిలో జరిగే శక్తి ఉత్పత్తి ప్రక్రియను అనుకరించడమే ఈ ప్రాజెక్ట్‌ ముఖ్య లక్ష్యం. ఇందులో భారత్‌, అమెరికా, చైనా, రష్యా, దక్షిణకొరియా, ఐరోపా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo