ఆదివారం 31 మే 2020
International - Apr 04, 2020 , 20:55:34

క‌రోనాతో ఇటలీ ప్రధాని భద్రతాధికారి మృతి

క‌రోనాతో ఇటలీ ప్రధాని భద్రతాధికారి మృతి

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది.  ముఖ్యంగా అమెరికా, యూరప్‌ దేశాలు అల్ల‌క‌ల్లోమ‌వుతున్నాయి. ఇటలీ, స్పెయిన్, అమెరికాలో భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. ఇటలీ ప్రధాని  భద్రతాధికారుల్లో ఒకరైన జార్జియో గుస్టామాచియా .. కరోనా కాటుకు ప్రాణాలు విడిచాడు. 52 ఏండ్ల గుస్టామాచియాకు.. గత మార్చి 21న కరోనా పాజిటివ్ సోక‌గా...ప్రధాని భద్రతా విభాగానికి సంబంధించిన విధుల నుంచి తప్పించి.. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కాగా.. గుస్టామాచియా గత రెండు వారాలుగా బ్రిటన్ ప్రధానికి దూరంగా ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. గత నెలలో గుస్టామాచియాకు పాజిటివ్ అని తేలడంతోనే.. వెంటనే ముందస్తు జాగ్రత్తగా ప్రధాని కాంటేకి కరోనా పరీక్షలు జరిపారు. ఈ టెస్టుల్లో ఆయనకు నెగిటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు.logo