రోమ్, ఏప్రిల్ 1:ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అధికారిక వ్యవహారాల్లో ఇంగ్లిష్‌ను వాడకుండా నిషేధించాలని ఇటలీలోని అధికార పార్టీ ఓ బిల్లును రూపొందించింది. ముఖ్యంగా ఇటాలియన్ భాషను ప్రోత్సహించడానికే ఈ బిల్లు రూపొందించినట్టు తెలిపింది. ఉల్లంఘిస్తే రూ.90 లక్షల వరకు జరిమానా విధించాలని ఆ బిల్లులో ఉన్నది.