బుధవారం 03 జూన్ 2020
International - Apr 28, 2020 , 15:07:32

క‌రోనాకు క‌వాసాకీకి లింకుందా?

క‌రోనాకు క‌వాసాకీకి లింకుందా?

క‌రోనాతో అత‌లాకుత‌లం అవుతున్న యూర‌ప్ దేశాల‌కు ఇప్పుడు మ‌రో అనుమానం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఆసియా ఖండంలోని ప‌లు దేశాల్లో ప‌దేండ్ల‌లోపు పిల్ల‌ల్లో క‌నిపించే క‌వాసాకి వ్యాధి ఇట‌లీ, బ్రిట‌న్ దేశాల్లో విజృంభిస్తుండ‌టంతో అక్క‌డి వైద్యులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఉత్త‌ర ఇట‌లీలో కోవిడ్‌-19 వైరస్ ప్ర‌భావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇటీవ‌లి కాలంలో చిన్న‌పిల్ల‌ల్లో క‌వాసాకి వ్యాధి అత్య‌ధికంగా క‌నిపిస్తున్న‌ది. బ్రిట‌న్‌లో కూడా ఇదే విధ‌మైన ల‌క్ష‌ణాల‌ను డాక్ట‌ర్లు గుర్తించారు. ఈ వ్యాధి సోకిన పిల్ల‌ల్లో విప‌రీత‌మైన జ్వ‌రం, ద‌వ‌డ‌లు వాచిపోవ‌టం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. 

క‌రోనా వ్యాధి ఎక్కువ‌గా ఉన్న చోట‌నే పిల్ల‌లు ఈ వ్యాధితో ఎక్కువ‌గా బాధ‌ప‌డుతుండ‌టంతో ఈ వ్యాధిపై త‌మ ప‌రిశోధ‌కులు దృష్టి సారించార‌ని బ్రిట‌న్ ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి మాట్ హాంకాక్ తెలిపారు. క‌రోనాకు, క‌వాసాకికి ఏమైనా సంబంధం ఉందేమోన‌నే కోణంలో ప‌రిశీల‌న జ‌రుగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. అమెరికాకు చెందిన ఓ బాల‌ల వైద్యుల సంఘం కూడా ఈ రెండు వ్యాధుల ల‌క్ష‌ణాలు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు తెలిపింది. అయితే క‌చ్చిత‌మైన ఆధారాలు ల‌భించేవర‌కు ఈ రెండు వ్యాధుల‌కు సంబంధం ఉంద‌ని చెప్ప‌లేమ‌ని ఇంగ్లండ్ మెడిక‌ల్ డైరెక్ట‌ర్ స్టీఫెన్ పోవిస్ అన్నారు. logo