గురువారం 02 జూలై 2020
International - Jun 01, 2020 , 11:40:31

క్యూఆర్‌ స్కాన్‌తో మెనూ డిస్‌ప్లే!

క్యూఆర్‌ స్కాన్‌తో మెనూ డిస్‌ప్లే!

సుమారు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు లాక్‌డౌన్‌ కారణంగా రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఇప్పుడు కొత్త హంగులతో మరలా ప్రారంభమవుతున్నాయి. కాకపోతే కరోనాకు భయటపడి ప్రజలు రెస్టారెంట్లకి వస్తారా? అని యజమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

సాధారణంగా రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లకు ఫుడ్‌ మెనూ చేతికిస్తే అందులో ఉన్న ఐటెమ్స్‌ను సెలెక్ట్‌ చేసుకుంటారు. వాటిని తయారు చేసి అక్కడ సిబ్బంది కస్టమర్లకు అందిస్తారు. ఇది కామన్‌. అయితే కరోనా కాలంలో మెనూ అందరి చేతులు దాటుతుండడం అంత మంచిది కాదని ఓ రెస్టారెంట్‌ యజమాని కొత్తగా క్యూఆర్‌ స్కాన్‌ రూపొందించాడు. కస్టమర్లు రెస్టారెంట్‌లో అడుగుపెట్టగానే వైటర్‌ క్యూఆర్‌ స్కాన్‌ కోడ్‌ చూపిస్తారు. కస్టమర్‌ తమ ఫోన్‌లో స్కాన్‌ చేసుకుంటే మొబైల్‌లో డిస్‌ప్లే చూపిస్తుంది. దీన్ని చూసుకొని ఆర్డర్‌ ఇవ్వొచ్చు. ఇకపోతే చెఫ్‌లు చేతికి గ్లౌజులు, మాస్క్‌, సేఫ్టీ గాగ్‌లెస్‌ ధరించి వంటలు చేస్తున్నారని ఇటలీలోని రెస్టారెంట్‌ యజమాని మరియా చియారా డి ఫెలిస్ తెలిపారు.  


logo