సోమవారం 01 జూన్ 2020
International - Apr 11, 2020 , 17:03:41

ఇటలీలో మే 3 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

ఇటలీలో మే 3 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

రోమ్‌: కరోనా వైరస్‌ పుట్టింది చైనాలో అయినా దానివల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశం మాత్రం ఇటలి. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 1,03,512 మంది మరణించాగా అందులో 19 వేల మంది ఇటలీకి చెందినవారే ఉన్నారు. మొత్తంగా దేశంలో లక్షా యాభైవేల మంది ఈ మహమ్మారి భారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో  లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు ఆ దేశ ప్రధాని మార్చి 10 నుంచి అమ  గియుసెప్‌ కాంటే ప్రకటించారు. కరోనా వైరస్‌ను వాప్తిని నిరోధించడానికి మార్చి 10న లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 17,10,798 మంది కరోనా వైరస్‌ బారిన పడగా, 1,03,512 మంది మరణించారు. 


logo