సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 20, 2020 , 14:01:40

కరోనా మృతుల్లో చైనాను మించిపోయిన ఇటలీ

కరోనా మృతుల్లో చైనాను మించిపోయిన ఇటలీ

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా మరణాల్లో ఇటలీ చైనాను మించిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 10,048 మంది మృతి చెందారు. ఇటలీలో 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2.45 లక్షలకు చేరితే, ఒక్క ఇటలీలోనే 41 వేల మందికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటలీలో గడిచిన 24 గంటల్లో 427 మంది మృతి చెందారు. చైనాలో వరుసగా రెండో రోజూ కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు. 

ఇరాన్‌లో 1,284, స్పెయిన్‌లో 831, ఫ్రాన్స్‌లో 372, అమెరికాలో 218, యూకేలో 144, దక్షిణ కొరియాలో 94, నెదర్లాండ్స్‌లో 76, జర్మనీలో 44, స్విట్జర్లాండ్‌లో 43 మంది మృతి చెందారు. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 195కు చేరుకోగా, మృతుల సంఖ్య ఐదుకు చేరింది.


logo