శనివారం 30 మే 2020
International - May 06, 2020 , 13:41:47

క‌రోనా వ్యాక్సిన్ త‌యారు చేశాం : ఇట‌లీ

క‌రోనా వ్యాక్సిన్ త‌యారు చేశాం : ఇట‌లీ


హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్‌తో అత‌లాకుత‌ల‌మైన ఇట‌లీ దేశం.. వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించుకున్న‌ది. మ‌నుషుల‌పైన కూడా దిగ్విజ‌యంగా ప్ర‌యోగించామ‌న్న‌ది. రోమ్‌లో ఉన్న అంటువ్యాధుల స్ప‌ల్ల‌న్‌జానీ హాస్పిట‌ల్‌లో ప్ర‌యోగాలు జ‌రిగిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఎలుక పిల్ల‌ల నుంచి తీసిన యాంటీబాడీల‌ను మ‌నుషుల్లో క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసిన‌ట్లు ఇట‌లీ మీడియా పేర్కొంటున్న‌ది. ఇట‌లీలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల 30 వేల మంది మ‌ర‌ణించారు.  మ‌రోవైపు అమెరికా శాస్త్ర‌వేత్తలు ఓ కొత్త విష‌యాన్ని క‌నిపెట్టారు.  గ‌తంలో గుర్తించిన క‌రోనా వేరియంట్ క‌న్నా ప్ర‌స్తుతం ఉన్న వైర‌స్ వేరియంట్ ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ట్లు లాస్ అలామోస్ నేష‌న‌ల్ ల్యాబ‌రేట‌రీ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.   


logo