బుధవారం 27 జనవరి 2021
International - Dec 19, 2020 , 12:55:07

క్రిస్మ‌స్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన ఇట‌లీ

క్రిస్మ‌స్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన ఇట‌లీ

హైద‌రాబాద్: ఇట‌లీలో మ‌ళ్లీ లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.  క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌ల సంద‌ర్భంగా క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్నారు. ప‌బ్లిక్ హాలీడే స‌మ‌యాల్లో దేశంలో రెడ్ జోన్ ఆంక్ష‌లు ఉంటాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. షాపులు, రెస్టారెంట్లు, బార్ల‌ను మూసి వేస్తున్నారు. కేవ‌లం ఆఫీసుకు వెళ్లేవారికి మాత్ర‌మే ట్రావ‌ల్ చేసే అనుమ‌తి ఇస్తున్నారు. హెల్త్‌, ఎమ‌ర్జెన్సీ సేవ‌లు కూడా ఉంటాయి.  క్రిస్మ‌స్ ప‌ర్విద‌న వేళ‌ల్లో చాలా స్వ‌ల్ప సంఖ్య‌లో అతిథుల‌ను ఆహ్వానించేందుకు అనుమ‌తి క‌ల్పించారు. తాము తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం సాధార‌ణ‌మైంది కాదు అని ఇట‌లీ ప్ర‌ధాని గుసెప్పొ కాంటె తెలిపారు.  క్రిస్మ‌స్ వేళ కేసులు పెరుగుతాయ‌ని నిపుణులు సూచించార‌ని, ఈ నేప‌థ్యంలో తాము లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌కు ఆమోదం తెలిపిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. ఇట‌లీలో కోవిడ్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 68 వేల మంది మ‌ర‌ణించారు.  ఈ నెల చివ‌రి నాటికి దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌ధాని కాంటె చెప్పారు.  

మ‌రో వైపు ఫ్రాన్స్ దేశాధ్య‌క్షుడు ఎమ్మాన్యువెల్ మాక్ర‌న్ ప్ర‌స్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు.  కోవిడ్ ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే.   అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, పొడి ద‌గ్గు స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న‌ట్లు మాక్ర‌న్ తెలిపారు.  అయితే ఇటలీలో విధించ‌నున్న రెడ్‌జోన్ ఆంక్ష‌లపై ఆ దేశం క్లారిటీ ఇచ్చింది.  ఈనెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వ‌ర‌కు, డిసెంబ‌ర్ 31 నుంచి జ‌న‌వ‌రి 3 వ‌ర‌కు, మ‌ళ్లీ 5 నుంచి జ‌న‌వ‌రి 6వ తేదీ వ‌ర‌కు ఈ అంక్ష‌లు అమ‌లులో ఉంటాయి. రాత్రి ప‌ది నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించ‌నున్నారు. 


logo