గురువారం 28 మే 2020
International - Apr 15, 2020 , 11:22:24

ఇది స‌మ‌యం కాదు: ఐక్య‌రాజ్య‌స‌మితి

ఇది స‌మ‌యం కాదు:  ఐక్య‌రాజ్య‌స‌మితి

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు నిధుల‌ను త‌గ్గించే స‌మ‌యం ఇది కాదు అని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియా గుటెర్ర‌స్ తెలిపారు. డ‌బ్ల్యూహెచ్‌వోకు నిధుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో గుటెర్ర‌స్ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. వైర‌స్‌పై పోరాటం చేస్తున్న త‌రుణంలో.. డ‌బ్ల్యూహెచ్‌వోకు కానీ, ఇత‌ర యూఎన్ సంస్థ‌ల‌కు నిధుల‌ను త‌గ్గించ‌డం స‌రికాదు అని ఆయ‌న అన్నారు. ఈ స‌మ‌యంలో ఐక్యత కావాల‌న్నారు. వైర‌స్ ప‌రిణామాల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ సంఘీభావంతో ప‌నిచేయాల‌న్నారు.  వైర‌స్ అసాధార‌ణ రీతిలో సంక్ర‌మిస్తున్న‌ద‌ని, ఇలాంటి స‌మ‌యంలో అసాధార‌ణ ప్ర‌తిస్పంద‌న ఉండాల‌ని గుటెర్ర‌స్ తెలిపారు. 


logo