బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 18:35:44

‘అక్కడ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడం కష్టం’

‘అక్కడ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడం కష్టం’

బ్రెజిల్‌ : లాటిన్ అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కరోనా కేసులున్న దేశంగా మారింది. ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ పేదరికం, జనసాంద్రత గల నగరాల కారణంగా లాటిన్ అమెరికాలో కరోనా వ్యాప్తిని నియంత్రించడం చాలా కష్టమని అంటున్నారు.

బ్రెజిల్‌లో 27లక్షలకు పైగా కేసులు నమోదు కాగా అక్కడ ఇప్పటివరకు 2 లక్షలకు పైగా ప్రజలు వైరస్‌ బారిన పడి మృతి చెందారు. కొలంబియాలో గత 24 గంటల్లో కొత్తగా 11,000 కరోనా కేసులు నమోదయ్యాయి. మెక్సికో, పెరూ, చిలీతో సహా ఇతర దేశాలు కరోనా వైరస్‌తో భీకరంగా పోరాడుతున్నాయి. అక్కడ కూడా ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo