బుధవారం 03 జూన్ 2020
International - Apr 07, 2020 , 08:41:32

క‌రోనా రోగుల‌ను గుర్తించే ప‌నిలో మొస్సాద్‌

క‌రోనా రోగుల‌ను గుర్తించే ప‌నిలో మొస్సాద్‌

న్యూఢిల్లీ: మొస్సాద్ అనేది ఇజ్రాయెల్ దేశపు గూఢ‌చార సంస్థ. ఈ సంస్థ తన సాహసోపేత చర్యలతో విశేష ప్రాచుర్యం పొందింది. అయితే ఇన్నాళ్లు శుత్రు దేశాల నుంచి దేశ ర‌క్ష‌ణ కోసం మాత్ర‌మే ప‌నిచేసిన మొస్సాద్ గూఢాచారులు.. ఇప్పుడు దేశంలో ప్ర‌వేశించిన క‌రోనా అనే శ‌త్రువు నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడే ప‌నిలో ప‌డ్డారు. అందుకే ఇప్పుడు తమ నిఘాను కరోనా రోగులపై పెడుతున్నారు. వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారు దేశంలో ఎక్క‌డున్నా గుర్తించే పనిలో ఉన్నారు. ప్ర‌స్తుతం క్వారెంటైన్‌లో ఉన్న క‌రోనా బాధితులు ఎవరెవరిని క‌లిశారో ఆరా తీసి వారి జాడ కోసం ఆరా తీస్తున్నారు. వారి లొకేష‌న్‌ను తెలుసుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. అనుమానితులను ఐసోలేష‌న్‌, క్వారంటైన్ కేంద్రాల‌కు తరలిస్తున్నారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందిస్తున్నారు. కరోనాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధంలో మోస్సాద్ సంస్థ‌ గూఢ‌చారులు తమవంతు స‌హ‌కారం అందిస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo