బుధవారం 03 జూన్ 2020
International - Apr 10, 2020 , 08:53:21

ప్ర‌ధాని మోదీకి ఇజ్రాయెల్ ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు

ప్ర‌ధాని మోదీకి ఇజ్రాయెల్ ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న కీలక సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన ఔషధాలు పంపుతున్న భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కొవిడ్‌-19 చికిత్సలో ఆశాజనక ఫలితాలు ఇస్తుందన్న మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపినందుకు ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌ సహా మరికొన్ని దేశాలు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. తాజాగా ఈ జాబితాలో ఇజ్రాయెల్‌ కూడా చేరింది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఉత్పత్తి చేసే పదార్థాలతో సహా మరికొన్ని ప్రాణాధార ఔషధాలతో ఎయిరిండియా విమానం మంగళవారం ఇజ్రాయెల్‌కు చేరింది. దాదాపు ఐదు టన్నుల ఔష‌ధాలు ఇజ్రాయెల్‌కు చేరాయి. కాగా, ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 10 వేల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. వారిలో 86 మంది మ‌ర‌ణించారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo