శనివారం 16 జనవరి 2021
International - Nov 23, 2020 , 14:57:07

సౌదీలో ఇజ్రాయెల్ ప్ర‌ధాని ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌!

సౌదీలో ఇజ్రాయెల్ ప్ర‌ధాని ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌!

జెరూస‌లెం: ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజామిన్ నెత‌న్యాహు ఆదివారం ర‌హ‌స్యంగా సౌదీలో ప‌ర్య‌టించారు. అక్క‌డ సౌదీ యువ‌రాజు మ‌హ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్‌, అమెరికా విదేశాంగ కార్య‌ద‌ర్శి మైక్ పాంపియోల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ విష‌యాన్ని సోమ‌వారం ఇజ్రాయెల్‌కు చెందిన కాన్ పబ్లిక్ రేడియో, ఆర్మీ రేడియో వెల్ల‌డించాయి. అయితే, సౌదీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి నెత‌న్యాహు కార్యాల‌యంగానీ, జెరూస‌లెంలోని అమెరికా రాయ‌బార కార్యాల‌యంగానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కాగా, ఈ మూడు దేశాల‌కు సంబంధించిన కీల‌క నేత‌లు ర‌హ‌స్యంగా స‌మావేశమై ఏ విష‌యంపై చ‌ర్చించార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

 లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.