శనివారం 06 జూన్ 2020
International - May 06, 2020 , 18:57:16

కరోనా చికిత్స సమాచారం అందరితో పంచుకుంటాం

కరోనా చికిత్స సమాచారం అందరితో పంచుకుంటాం

హైదరాబాద్: కోవిడ్-19 యాంటీబాడీస్ తయారు చేయడంలో ఇజ్రేల్ ముందంజ సాధించినట్టు వస్తున్న వార్తలపై ఢిల్లీలోని ఆ దేశ రాయబారి రాన్ మల్కా స్పందించారు. క్లినికల్ ట్రయల్స్ గురించిన వివరాల కోసం ఎదురుచూస్తున్నట్టు బుధవారం ఏఎన్ఐ వార్తాసంస్థకు చెప్పారు. కోవిడ్-19 వైరస్ యాంటీబాడీలను తమ దేశం తయారు చేసిందని, పేటెంటు తీసుకోవడం, పెద్దఎత్తున ఉత్పత్తి చేపట్టడమే తరువాయి అని ఇజ్రేల్ రక్షణమంత్రి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఇజ్రేల్ కరోనా చికిత్సకు చేరువైందన్న అభిప్రాయాలు కలిగించే విధంగా ఆయన ప్రకటన ఉండడమే అందుకు కారణం. ఆ వార్తలను ఇజ్రేల్ రాయబారి దాదాపుగా ధ్రువీకరించారు. విధానాలు ఇంకా ఖరారు కాలేదు. పరిశోధనలు పురోగామి దశలో ఉన్నాయి. ఆ సమాచారాన్ని మేం ప్రపంచంతో తప్పకుండా పంచుకుంటాం' అని మల్కా అన్నారు. కరోనా కల్లోలం భారత్, ఇజ్రేల్ దేశాలను మరింత దగ్గరకు చేర్చిందని తెలిపారు. రెండు దేశాలు ఉత్తమ ప్రక్రియలను, కొత్త అంశాలను పంచుకుంటున్నాయి అని ఇజ్రేల్ రాయబారి అన్నారు.


logo