శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 02, 2020 , 23:10:31

16 నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రారంభం : ఇజ్రాయిల్‌ రవాణాశాఖ మంత్రి

16 నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రారంభం : ఇజ్రాయిల్‌ రవాణాశాఖ మంత్రి

టెల్ అవివ్ :  ఇజ్రాయెల్‌లో ఆగస్టు 16 నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించనున్నట్లు రవాణాశాఖ మంత్రి మిరి రెగెవ్ తెలిపారు. ఇజ్రాయిల్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ విమానాలను పునరుద్ధరించడానికి సన్నాహాలు చేస్తోందని, ప్రయాణికులకు వేగవంతంగా 20 -30 నిమిషాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సైతం ఏర్పాట్లు చేశామని ఆమె పేర్కొన్నారు. కరోనా తీవ్రత తక్కువ ఉన్న దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చే ప్రయాణికులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇజ్రాయిల్లో ఇప్పటి వరకు 70,970 కరోనావైరస్ కేసులు నమోదు కాగా 526 మృతి చెందారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఓ నివేదికలో వెల్లడించింది. logo