ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 17, 2020 , 01:12:04

మధ్యప్రాచ్యానికి సరికొత్త ఉషోదయం!

మధ్యప్రాచ్యానికి సరికొత్త ఉషోదయం!

  • అబ్రహం ఒడంబడికపై ఇజ్రాయెల్‌, యూఏఈ, బహ్రెయిన్‌ సంతకాలు

వాషింగ్టన్‌: చారిత్రాత్మక ‘అబ్రహం శాంతి ఒడంబడిక’పై ఇజ్రాయెల్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌ మంగళవారం సంతకాలు చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమక్షంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, యూఏఈ, బహ్రెయిన్‌ విదేశాంగ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దాదాపు 26 ఏండ్ల తర్వాత అరబ్‌-ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఇది. దశాబ్దాల ఘర్షణ తర్వాత మధ్యప్రాచ్యానికి ఇది సరికొత్త ఉషోదయంగా ట్రంప్‌ అభివర్ణించారు. తాజా ఒప్పందం ప్రకారం.. యూఏఈ, బహ్రెయిన్‌లు ఇజ్రాయెల్‌లో ఎంబసీలు ఏర్పాటుచేయడంతోపాటు వివిధ రంగాల్లో ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు వీలవుతుంది. 


logo