శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Feb 23, 2021 , 12:48:32

తొలిసారిగా అమలులోకి వచ్చిన ఐఎస్‌ఓ ధ్రువీకరణ.. చరిత్రలో ఈరోజు

తొలిసారిగా అమలులోకి వచ్చిన ఐఎస్‌ఓ ధ్రువీకరణ.. చరిత్రలో ఈరోజు

ఒక సంస్థ ఐఎస్‌ఓ 9001 ధ్రువీకరణ పొందింది అన్న ముద్రను మనం చాలా కంపెనీల బోర్డులపై చూస్తుంటాం. అంటే.. ఆ సంస్థ ఉత్పత్తులు, సేవల నాణ్యత బాగుంటుందని ఈ ధ్రువీకరణ పత్రం హామీ ఇస్తున్నట్లుగా భావించాలి. ఈ ఐఎస్‌ఓ ధ్రువీకరణ అనేది 1947 లో సరిగ్గా ఇదే రోజున అమలులోకి వచ్చింది. ఐఎస్‌ఓ అంటే.. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ప్రపంచంలోని 165 దేశాలు సభ్యులుగా ఉన్న ప్రభుత్వేతర సంస్థ ఇదొక్కడే కావడం విశేషం. తొలుత 1946 లో లండన్‌లో సమావేశమైన 25 దేశాలకు చెందిన 65 మంది ప్రతినిధులు ఐఎస్‌ఓ గురించి చర్చించారు. 

మీరు ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రం అందుకున్నారంటే.. మీ వ్యాపారం, వ్యాపార విశ్వసనీయతను మెరుగుపరచడంలో అది ఎంతగానో సహాయపడుతుంది. ఐఎస్‌ఓ 9000, ఐఎస్‌ఓ 9001, ఐఎస్‌ఓ 9001: 2015 వంటి అనేక ధ్రువపత్రాలను ఈ సంస్థ అందిస్తుంది. ఇవన్నీ కూడా ఉత్పత్తులు, సేవల నాణ్యత గురించి ప్రపంచానికి చాటేవే. మారుతున్న కాలంతో అవసరాలు, ప్రమాణాలు కూడా మారుతుతున్నందున ఈ ధ్రువీకరణ పత్రాలు కూడా నవీకరించబడుతున్నాయి. ఈ మార్పుల ఆధారంగా ఐఎస్‌ఓ 9000 నుంచి ఐఎస్‌ఓ 9001 కు నవీకరణలు కనిపిస్తాయి. ఐఎస్‌ఓ ధ్రువీకరణ పరిశ్రమ యొక్క ఇంధన నిర్వహణ, సామాజిక బాధ్యత నుంచి వైద్య పరికరాల వరకు కొనసాగుతుంది. ప్రతి సర్టిఫికెట్‌కు వేర్వేరు ప్రమాణాలు ఉంటాయి.  

ఐఎస్‌ఐ - ఐఎస్‌ఓ వేర్వేరేనా..?

ఎలక్ట్రానిక్ వస్తువులను కొనడానికి వెళ్ళినప్పుడల్లా దానిపై ఐఎస్ఐ గుర్తు ఉందా? లేదా? అని ఖచ్చితంగా చూస్తుంటాం. ఈ గుర్తు మనకు నాణ్యతకు భరోసా ఇస్తుంది. ఐఎస్‌ఐ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్. ఈ సంస్థ 1955 లో ఏర్పడి నమ్మకానికి చిహ్నంగా మారింది. దీనికి 1987 లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌)గా పేరు మార్చారు. అనేక ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు కొన్ని ఇతర వస్తువులపై ఐఎస్ఐని వర్తింపచేయడం ఇప్పటికీ తప్పనిసరిగా ఉన్నది. ఒక ఉత్పత్తి నాణ్యతకు ఐఎస్‌ఐ హామీ ఇస్తే, ఆ ఉత్పత్తిని తయారుచేసే లేదా అందించే ప్రక్రియను ఐఎస్‌ఓ ధ్రువీకరిస్తుంది. 

మరికొన్ని ముఖ్య సంఘటనలు :

2010: భారతదేశపు ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌కు పౌరసత్వం ఇచ్చిన ఖతార్‌

2006: ఇరాక్‌లో జాతి హింసలో సుమారు 160 మంది దుర్మరణం

2004: నటుడు, నిర్మాత, దర్శకుడు, హిందీ చిత్రాల సంపాదకుడు విజయ్ ఆనంద్ మరణం

1981: రాజకీయ అనిశ్చితి స్థితిని సృష్టించి స్పెయిన్‌ను పడగొట్టిన మితవాద సైన్యం 

1970: గయానా జాతీయ దినం

1969: సినీ నటి మధుబాల మరణం

1967: వియత్నాం యుద్ధంలో పెద్ద దాడిని ప్రారంభించిన యూఎస్ బలగాలు

1964: తన స్టాండ్‌ మార్చుకుని కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన చైనా

1952: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిబంధనల చట్టానికి ఆమోదం

1940: గ్రీస్‌కు దగ్గరగా ఉన్న లాసి ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న రష్యన్ దళాలు

1905: ప్రపంచంలో మొట్టమొదటి రోటరీ క్లబ్‌ను రూపొందించిన చికాగో అటార్నీ పాల్ పీ హారిస్

1886: అల్యూమినియంను కనుగొన్న అమెరికాకు చెందిన రసాయన శాస్త్రవేత్త మార్టిన్ హేల్ 

1822: చార్టర్ అందుకుని నగరంగా మారిన బోస్టన్ 

1768: హైదరాబాద్ నిజాంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటన్‌ కల్నల్ స్మిత్

1468: ప్రింటింగ్ యంత్రాన్ని కనుగొన్న యుహెన్ గుటెన్‌బర్గ్ మరణం

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo