సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 03, 2020 , 17:01:45

కుల్భూషణ్ కు న్యాయ సలహాదారును నియమించండి

కుల్భూషణ్ కు న్యాయ సలహాదారును నియమించండి

ఇస్లామాబాద్: కుల్భూషణ్ జాదవ్‌ కు న్యాయ సలహాదారును నియమించేందుకు భారత అధికారులకు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం పాకిస్తాన్ ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ నెలకు వాయిదా వేసింది. 

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సివిల్ కోర్టులలో సైనిక కోర్టు ఉత్తర్వులను సమీక్షించడానికి అనుమతించే ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టింది. దీనిపై అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. జాదవ్‌కు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. అయితే, ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. సైనిక కోర్టు ఆదేశించిన మరణశిక్షను సమీక్షించటానికి పాకిస్తాన్‌ను కోరిన అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. భారత కమాండర్ కుల్భూషణ్ సుధీర్ జాదవ్ కుఉపశమనం కలిగించే ఉద్దేశ్యంతో రహస్యంగా ఒక ఆర్డినెన్స్ ను తీసుకువచ్చారన్న ఆరోపణలను న్యాయ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఐసీజే ఆదేశాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపింది. కుల్భూషణ్ జాదవ్ కు న్యాయ ప్రతినిధిని నియమించేలా భారత్ కు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. న్యాయ సలహాదారుడిని పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్న ఆరోపణలపై భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ అరెస్టు చేసింది. అనంతరం మిలటరీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. మరణశిక్షను ఇచ్చే విధానాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం సమీక్షించాలని కోరుతూ భారత ప్రభుత్వం ఐసీజేలో సవాలు చేసింది. జాదవ్‌కు 'అనియంత్రిత' కాన్సులర్ ప్రవేశం కోసం భారత్ చేసిన అభ్యర్థనలకు పాకిస్తాన్ స్పందించలేదు. 

తాజావార్తలు


logo