బుధవారం 03 జూన్ 2020
International - Apr 23, 2020 , 09:50:23

ఐసిస్ టాప్ కమాండర్ అరెస్ట్‌

ఐసిస్ టాప్ కమాండర్ అరెస్ట్‌

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు  ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఖొరసాన్ విభాగం టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్‌ను అరెస్టు చేశాయి. మునీబ్ పాకిస్థాన్ దేశ‌స్తుడని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్) తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవెంట్ – ఖొరసాన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్ అత్యంత కీలకమైన ఉగ్రవాద‌ని ఎన్‌డీఎస్ పేర్కొంది. కాగా.. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), లష్కరే తొయిబా, హక్కానీ నెట్‌వర్క్, సిపా-ఈ-సహబా, జమాత్-ఉల్-ఉలేమా-ఈ-ఇస్లామ్ వంటి  ఉగ్రవాద సంస్థలతో మునీబ్  అత్యంత  సన్నిహిత సంబ‌ధాల‌తో పాటు.. వీటన్నిటికీ ఓ వారథిలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని తెలిపింది. ఉగ్రవాద సంస్థలు, నిఘా వ్యవస్థల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. మునీబ్ డాయిష్ గ్రూప్‌లో చేరడానికి ముందు అల్‌ఖైదాలో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది.


logo