ఆదివారం 06 డిసెంబర్ 2020
International - Nov 02, 2020 , 21:13:57

50 అడుగుల అన‌కొండ వీడియో నిజం కాద‌ట‌..!

50 అడుగుల అన‌కొండ వీడియో నిజం కాద‌ట‌..!

సాధారణంగా 10, 15, 20 అడుగుల కొండ‌చిలువలు అప్పుడ‌ప్పుడు కెమెరా కంట ప‌డ్డ సంద‌ర్బాలు చాలా ఉన్నాయి. కానీ ఇటీవ‌లే ఓ భారీ పొడ‌వైన అన‌కొండ అంటూ నెట్టింట్లో వీడియో హ‌ల్ చ‌ల్ చేసిన సంగతి తెలిసిందే.  బ్రెజిల్ లోని గ్జింగు న‌దిలో 50 అడుగుల పొడ‌వున్న అన‌కొండ క‌నిపించిందంటూ ది డార్క్ సైడ్ ఆఫ్ నేచర్ ట్విట‌ర్ ఖాతాలో వీడియోను అప్ లోడ్ చేశారు. ఈ వీడియో కాస్తా వైర‌ల్ అయింది. ఈ వీడియోకు ట్విట‌ర్ లో 7 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. న‌ది ఒక చివ‌ర నుండి మ‌రో చివ‌ర‌కు వెళ్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్న అన‌కొండ 50 అడుగులుంద‌డం నిజం కాద‌ట‌.

2018 నుంచి ఈ వీడియో ఇంట‌ర్ నెట్ లో క‌నిపిస్తుండ‌గా..యూ ట్యూబ్ లో భారీ అన‌కొండ రోడ్డు క్రాస్ చేస్తుందంటూ లొకేష‌న్ ఎక్క‌డో పేరు చెప్ప‌కుండా వీడియోను అప్ లోడ్ చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.