డబ్లిన్: ఐర్లాండ్ అధ్యక్షుడు లైవ్ టీవీలో మాట్లాడుతుండగా ఆయన పెంపుడు కుక్క చేసిన చిలిపి చేష్టలు అందరి దృష్టిని ఆకట్టుకున్నది. శనివారం చనిపోయిన నటుడు టామ్ హిక్కీకి ఐరిష్ అధ్యక్షుడు మైఖేల్ డి హిగ్గిన్స్ సోమవారం నివాళి అర్పిస్తూ లైవ్‌లో మాట్లాడారు. మరోవైపు పక్కనే ఉన్న అధ్యక్షుడి పెంపుడు కుక్క ఏడు నెలల మిస్నీచ్ ఆయన చేతిని లాగుతూ, కొరుకుతూ ఆటలాడసాగింది.
అధ్యక్షుడు హిగ్గిన్స్ కూడా విసుగుకోకుండా తన చేతితో దానిని సముదాయిస్తూనే లైవ్ స్పీచ్‌ను కొనసాగించారు. అనంతరం అధ్యక్షుడి కార్యాలయం ఈ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఐరిష్ అధ్యక్షుడి పెంపుడు కుక్క చేష్టలపై పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.