బుధవారం 03 జూన్ 2020
International - Mar 31, 2020 , 16:26:08

వైర‌స్ వేళ‌.. సురక్షిత శృంగారం మేలు

వైర‌స్ వేళ‌.. సురక్షిత శృంగారం మేలు


హైద‌రాబాద్: క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌పంచ దేశాలు అనేక ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఐర్లాండ్ కూడా త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు కొన్ని విజ్ఞ‌ప్తులు చేసింది.  మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న త‌రుణంలో..  శృంగారంలో పాల్గొనాల‌నుకునేవాళ్లు సుర‌క్షిత‌మైన ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబించాల‌ని ఆ దేశం త‌న ఆరోగ్య‌ సూచ‌న‌ల్లో పేర్కొన్న‌ది.  సేఫ్ సెక్స్ ఉత్త‌మ‌మైంద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది. మీతో జీవ‌నం చేస్తున్న‌వారితో మాత్ర‌మే సెక్స్‌లో పాల్గొనాల‌ని, లేదంటే వైర‌స్ ల‌క్ష‌ణాలు లేన‌టువంటి వారితో శృంగారం చేయాల‌ని గైడ్‌లైన్స్ జారీ చేసింది.  బ‌య‌టి వ్య‌క్తుల‌కు కానీ, వైర‌స్ సంక్ర‌మించిన వారికి కానీ కిస్సులు ఇవ్వ‌కూడ‌దంటూ హెల్త్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆదేశించారు. వైర‌స్ విజృంభిస్తున్న వేళ‌.. శారీర‌క క‌ల‌యిక‌ల నుంచి బ్రేక్ తీసుకోవ‌డం ఎంతో శ్రేయ‌స్క‌రం అని పేర్కొన్నారు. శృంగార వాంఛ ఉన్న వారు వీడియో డేటింగ్‌, సెక్స్‌టింగ్‌, చాట్ రూమ్‌ల‌ను ఆప్ష‌న్‌గా వాడుకోవాల‌న్న‌ది.  అయితే ఇత‌రుల‌తో పంచుకునే కీబోర్డులు, ట‌చ్ స్క్రీన్ల‌ను ఇన్‌ఫెక్స‌న్ ఫ్రీ అయ్యేలా చూసుకోవాల‌న్నారు.  హ‌స్త ప్ర‌యోగం వ‌ల్ల క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌క‌పోయినా.. ముందు, త‌ర్వాత మాత్రం 20 సెక్ష‌న్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాల‌ని కూడా ఐర్లాండ్ హెల్త్ అడ్వైజ‌రీలో పేర్కొన్నారు.

 logo