శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 16:30:35

అమెరికా డమ్మీ నౌకను పేల్చేసిన ఇరాన్

అమెరికా డమ్మీ  నౌకను పేల్చేసిన  ఇరాన్

న్యూఢిల్లీ: వ్యూహాత్మక  జలసంధి  హర్మజ్‌లో ఇరాన్‌ యుద్ధ విన్యాసాలను నిర్వహించింది.  అమెరికా నౌకను పోలిన డమ్మీ విమాన  వాహక నౌకను ఇరాన్‌ క్షిపణులతో ధ్వంసం చేసింది.  హర్మజ్‌లోని నకిలీ నౌకను ఇరాన్‌ నావికాదళం హెలికాప్టర్‌ ద్వారా  క్షిపణులను ప్రయోగించి పేల్చేసింది. గల్ఫ్ సముద్ర జలాల్లో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో  ఇరాన్‌ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్‌  మిలటరీ డ్రిల్స్‌  నిర్వహించింది. 

ఐతే ఇరాన్‌ చర్యలను అమెరికా నేవీ తీవ్రంగా   ఖండించింది. ఇది ఇరాన్‌ బాధ్యతారహితమైన చర్య అని అగ్రరాజ్యం  వ్యాఖ్యానించింది. తమను రెచ్చగొట్టడానికి, భయపెట్టడానికి  ఇరాన్‌ చేసిన ప్రయత్నంగా  అమెరికా పేర్కొన్నది.  'గ్రేట్‌  ప్రొఫెట్ మొహ్మద్‌ 14'  పేరుతో  నిర్వహించిన మిలిటరీ డ్రిల్స్‌ను   ఇరాన్‌ అధికార వార్తా సంస్థ ప్రసారం చేసింది.


logo