సోమవారం 01 జూన్ 2020
International - May 11, 2020 , 12:00:47

సొంత‌ నౌక‌ను పేల్చిన ఇరాన్‌.. 40 మంది నావికులు మృతి

సొంత‌ నౌక‌ను పేల్చిన ఇరాన్‌.. 40 మంది నావికులు మృతి

హైద‌రాబాద్‌: ఇరాన్ త‌న స్వంత నౌక‌నే పొర‌పాటున పేల్చేసింది.  మిస్సైల్ ప‌రీక్ష చేప‌ట్టిన ఇరాన్ గార్డ్స్‌.. ఓ లాజిస్టిక్స్ నౌక‌ను పేల్చేశారు. ఈ ఘ‌ట‌న‌లో డ‌జ‌న్ల సంఖ్య‌లో నావికులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఓ మీడియా ప్ర‌కారం 40 మంది మృతిచెందిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఇరాన్ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్‌కు చెందిన ఫ్రిగేట్ జ‌మర‌న్‌.. తాజాగా యాంటీ షిప్‌ మిస్సైల్ ప‌రీక్ష చేప‌ట్టింది. అయితే ఆ మిస్సైల్‌ పొర‌పాటును కొన‌రాక్ అనే మ‌రో నౌక‌ను టార్గెట్ చేస్తూ లాక్ చేసింది.  ఫ్రిగేట్‌ను వ‌దిలిన ఇరాన్ .. ఆ ప్ర‌మాదాన్ని నిలువ‌రించ‌లేక‌పోయింది. ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మాత్రం ఈ ప్ర‌మాదంలో ఒక‌రే చ‌నిపోయిన‌ట్లు చెబ‌తున్న‌ది. ప‌లువురు గాయ‌ప‌డిన‌ట్లు పేర్కొన్న‌ది.  స్ట్రెయిట్ ఆఫ్ హ‌ర్మేజ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీన్ని ఓ ప్ర‌మాదం‌గా ఆ దేశం వ‌ర్ణించింది. 

ఇరాన్‌కు చెందిన రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ కార్ప్స్ జ‌మర‌న్ యుద్ధ‌నౌక‌ను ఆప‌రేట్ చేస్తున్నారు. అయితే కొన‌రాక్ అనే నౌక త‌న దారి నుంచి వెళ్ల‌క‌ముందే.. జ‌మ‌ర‌న్ ఫ్రిగేట్‌తో దాడి చేశారు.  ఇటీవ‌ల ఇరాన్‌పై అమెరికా ఆగ్ర‌హంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇరాన్ నౌక‌లు ఏవైనా వేధించిన‌ట్లు అనిపిస్తే, వాటిని వెంట‌నే పేల్చి వేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. కానీ ఇరాన్ మాత్రం స్వంత నౌక‌నే పేల్చేసింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కూడా ఇరాన్ పొర‌పాటును ఉక్రెయిన్ విమానాన్ని నేల‌కూల్చిన విష‌యం తెలిసిందే. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ వ‌ద్ద జ‌రిగిన ఆ ప్ర‌మాదంలో 176 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. 


logo