శనివారం 30 మే 2020
International - May 05, 2020 , 11:18:25

ఇరాన్ విమాన‌ సంస్థ‌పై వైర‌స్ ఆరోప‌ణ‌లు..

ఇరాన్ విమాన‌ సంస్థ‌పై వైర‌స్ ఆరోప‌ణ‌లు..

హైద‌రాబాద్‌: ఇరాన్ దేశానికి చెందిన ప్రైవేటు విమాన సంస్థ మ‌హాన్ ఎయిర్‌.. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  ఆ దేశంలోని రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్‌తో అనుబంధం క‌లిగిన మ‌హాన్ ఎయిర్ సంస్థ‌.. మ‌ధ్య‌ప్రాశ్చ్య దేశాల్లో వైర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మైన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  టెహ్రాన్ నుంచి ఆప‌రేట్ చేస్తున్న ఆ సంస్థ‌.. త‌మ విమానాల్లో వైర‌స్ సోకిన వ్య‌క్తుల‌ను లెబ‌నాన్‌, ఇరాక్‌ లాంటి దేశాల‌కు చేర‌వేసిన‌ట్లు కొన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  ఇరాన్‌కు చెందిన విమాన సంస్థ వ‌ల్ల‌నే.. లెబ‌నాన్‌, ఇరాక్ దేశాల్లో వైర‌స్ కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తున్న‌ది. విమాన సంస్థ త‌మ క్యాబిన్ సిబ్బందిని అణిచిపెట్టిన‌ట్లు ఈ విష‌యంలో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌హాన్ ఎయిర్‌కు చెందిన విమానాల ఫ్ల‌యిట్ డేటాను కూడా ప‌రిశీలించారు. ఆ విమానాలు ఎక్కువ శాతం టెహ్రాన్ నుంచి చైనా ప్ర‌యాణించిన‌ట్లు తేల్చారు.  అయితే దీనిపై కామెంట్ చేసేందుకు మ‌హాన్ ఎయిర్ సంస్థ నిరాక‌రించింది.logo