గురువారం 28 మే 2020
International - Apr 06, 2020 , 16:04:22

మేం అమెరికా సాయం కోరలేదు, కోరబోం: ఇరాన్‌

మేం అమెరికా సాయం కోరలేదు, కోరబోం: ఇరాన్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై పోరాటానికి సంబంధించి మేం ఇప్పటివరకు అమెరికా సాయం కోరలేదని, ఎప్పటికీ కోరబోమని ఇరాన్‌ ప్రకటించింది. ఈ వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన ఇరాన్‌కు మనవతా దృక్పథంలో సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను ఇరాన్‌ సుప్రిం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పోరాటంలో అమెరికాను సహాయం చేయాలని టెహ్రాన్‌ అడగలేదు, అడగ బోదుకూడా అని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికారప్రతినిధిని అబ్బాస్‌ మౌసావి ప్రకటించారు. అయితే ఇరాన్‌పై అమెరికా అక్రమంగా, ఏకపక్షంగా విధించిన ఆంక్షలన్నింటిని ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇర్‌న్‌లో ఇప్పటివరకు 58,226 మంది కరోనా భారిన పడగా, 3,603 మంది మరణించారు. 


logo