మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 13, 2020 , 14:20:52

క‌రోనా వ్యాక్సిన్ త‌యారీలో ఇరాన్ మ‌రో ముందడుగు

క‌రోనా వ్యాక్సిన్ త‌యారీలో ఇరాన్ మ‌రో ముందడుగు

టెహ్రాన్‌: కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఇరాన్‌ మరో ముందడుగు వేసింది. ఇరాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ స్వతంత్రంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రీ క్లినకల్‌ ట్రయల్స్‌ విజయంతంగా పూర్తి చేసుకుంది. దీన్ని ఇటీవల జంతువులపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో మనుషులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వం ఒక ప్ర‌క‌ట‌న చేసింది. మూడు దశల్లో ఈ ప్రయోగాలు జరుపనున్నారు.

కాగా, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వ‌చ్చేవ‌రకు ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇరాన్‌ ప్రభుత్వం కోరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. త్వరలోనే క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తిచేసి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఇరాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ డీన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo