శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 10, 2020 , 15:43:43

మిస్సైళ్ల‌తో విమానాన్ని పేల్చ‌లేదు.. మీ ద‌గ్గ‌ర డేటా ఉంటే ఇవ్వండి

మిస్సైళ్ల‌తో విమానాన్ని పేల్చ‌లేదు.. మీ ద‌గ్గ‌ర డేటా ఉంటే ఇవ్వండి
  • టెహ్రాన్ స‌మీపంలో కూలిన ఉక్రెయిన్ విమానం
  • స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్

హైద‌రాబాద్‌: ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ స‌మీపంలో కూలిన ఉక్రెయిన్ విమానంపై అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ జ‌రిపిన మిస్సైల్ దాడి వ‌ల్ల‌.. ఉక్రెయిన్ విమానం కూలిన‌ట్లు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా, కెన‌డాతో పాటు ఇత‌ర కొన్ని దేశాలు ఆ అంశాన్ని ద్రువీక‌రిస్తున్నాయి. దీంతో ఇరాన్ ఈ ఘ‌ట‌న‌పై ఇవాళ స్పందించింది. ఇరాన్ మిస్సైళ్లు ఉక్రెయిన్ విమానాన్ని కూల్చిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఆ దేశం ఖండించింది. విమాన ప్ర‌మాదంలో 176 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఢీకొట్టిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని ఇరాన్ పేర్కొన్న‌ది. క‌చ్చితంగా ఉక్రెయిన్ విమానాన్ని ఎటువంటి మిస్సైల్ ఢీకొట్ట‌లేద‌ని ఇరాన్ పౌర‌విమానాయ‌శాఖ అధికారి అలీ అబెద్‌జాదె తెలిపారు. ఒక‌వేళ పాశ్చాత్య దేశాలు చేసే ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఉంటే, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల ప్ర‌కారం వాళ్లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న డేటాను ఇవ్వాల‌న్నారు. విమాన బ్లాక్ బాక్సుల నుంచి డేటాను సేక‌రించ‌డానికి మ‌రో నెల స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ పూర్తి కావడానికి ఏడాది కాలం ప‌డుతుంద‌ని ద‌ర్యాప్తు అధికారి హ‌స‌న్ రెజాఫ‌ర్ తెలిపారు.


logo