గురువారం 04 జూన్ 2020
International - Apr 14, 2020 , 17:29:57

ఇరాన్‌లో నెల తర్వాత రెండంకెలకు కరోనా మృతులు

ఇరాన్‌లో నెల తర్వాత రెండంకెలకు కరోనా మృతులు

టెహ్రాన్‌: కరోనా వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇరాన్‌ ఒకటి. సుమారు నెల రోజుల తర్వాత ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య రెండంకెలకు దిగివచ్చింది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో 98 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది.  ఇప్పటివరకు ఇరాన్‌లో ఈ ప్రమాదకరమైన వైరస్‌వల్ల 4683 మరణించారు. దేశంలో కొత్తగా 1,574 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, మొత్తంగా 74,877 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, యూకే తర్వాత అత్యధిక మరణాలు నమోదైన దేశం ఇరాన్‌ కావడం విశేషం.


logo