మంగళవారం 26 జనవరి 2021
International - Jan 08, 2021 , 23:23:31

అమెరికా, బ్రిట‌న్‌ల నుంచి వ్యాక్సిన్ల‌పై ఇరాన్ నిషేధం.. ఎందుకంటే?

అమెరికా, బ్రిట‌న్‌ల నుంచి వ్యాక్సిన్ల‌పై ఇరాన్ నిషేధం.. ఎందుకంటే?

టెహ్రాన్‌: అమెరికా, బ్రిట‌న్ దేశాల నుంచి క‌రోనా వ్యాక్సిన్ల దిగుమ‌తిపై ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తుల్లా అలీ ఖమేనీ నిషేధం విధించారు. త‌మ‌పై విధించిన ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌ని శుక్ర‌వారం జాతినుద్దేశించి చేసిన ప్ర‌సంగంలో అమెరికా, బ్రిట‌న్‌ల‌ను కోరారు. ఇరాన్‌ను సుదీర్ఘ కాలంగా ఈ రెండు ప‌శ్చిమ దేశాలు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్న సంగ‌తిని గుర్తు చేశారు. అమెరికా, బ్రిట‌న్‌ల‌కు బ‌దులు ఇత‌ర న‌మ్మ‌ద‌గిన దేశాల నుంచి ఇరాన్.. క‌రోనా నియంత్ర‌ణ వ్యాక్సిన్ల‌ను పొందుతుంద‌ని ఖ‌మేనీ వెల్ల‌డించారు. 

అయితే ఏ దేశాల నుంచి వ్యాక్సిన్లు పొందుతార‌న్న విష‌య‌మై ఖ‌మేనీ ఇత‌ర వివ‌రాలేమీ బ‌య‌ట‌పెట్ట‌లేదు. చైనా, ర‌ష్యాలు ఇరాన్‌కు మిత్ర దేశాలుగా ఉన్నాయి. అమెరికా, బ్రిట‌న్ దేశాల నుంచి వ్యాక్సిన్ల దిగుమ‌తిపై నిషేధం విధించామ‌ని ఖ‌మేనీ చెప్పారు. అవి న‌మ్మ‌దగిన దేశాలు కాదన్నారు. ఆ రెండు దేశాలు ఇత‌ర దేశాల‌ను విష‌పూరితం చేయాల‌ని కోరుకుంటాయ‌న్నారు. బ‌రాక్ ఒబామా హ‌యాంలో అమెరికా కుదుర్చుకున్న అణ్వ‌స్త్ర నిరోధ‌క ఒప్పందం నుంచి 2015లో డొనాల్డ్ ట్రంప్ ఏక‌ప‌క్షంగా వైదొలిగారు. నాటి నుంచి, ప్ర‌త్యేకించి 2018 నుంచి అమెరికా, ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పెరిగిపోయాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo