శనివారం 30 మే 2020
International - Apr 25, 2020 , 17:48:15

ఇరాన్‌లో 90వేలకు చేరువలో కరోనా కేసులు

ఇరాన్‌లో 90వేలకు చేరువలో కరోనా కేసులు

టెహ్రాన్‌:  కరోనా మహమ్మారి ఇరానీయులను వణికిస్తోంది. శనివారం మధ్యాహ్నం వరకు ఇరాన్‌లో కొత్తగా 1,134 కరోనా కేసులు నమోదు కాగా 76 మంది మృత్యువాత పడినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 89,328కి చేరింది. భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదైనప్పటికీ మెరుగైన వైద్యాన్ని వెంటనే అందించడంతో 68,193 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,650 మంది చనిపోయారు. శనివారం వరకు ఇరాన్‌ 4,10,075 శాంపిల్స్‌కు కరోనా పరీక్షలు చేసింది. 


logo