శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 23, 2020 , 00:27:13

మీ సాయం మాకొద్దు

మీ సాయం మాకొద్దు

-అమెరికా ఆఫర్‌ను తిరస్కరించిన ఇరాన్‌ 

టెహ్రాన్‌: కరోనాపై పోరాటం జరిపేందుకు తమ బద్ధ శత్రువైన అమెరికా సాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము స్వీకరించబోమని ఇరాన్‌ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని (అమెరికా) ఎవరూ నమ్మరు. కరోనాను ఎల్లకాలం సజీవంగా ఉంచే ఔషధాలను మా దేశంలోకి తెచ్చే సామర్థ్యం మీకు ఉంది. అందుకే మీ సాయం మాకొద్దు. అమెరికా భయంకరమైన, దుర్మార్గపు శత్రువు. అమెరికన్లు అబద్ధాల కోరులు. అత్యాశ పరులు’ అని వ్యాఖ్యానించారు. 


logo