శనివారం 30 మే 2020
International - May 06, 2020 , 17:19:55

ఇరాన్‌లో లక్ష దాటిన కరోనా కేసులు

ఇరాన్‌లో లక్ష దాటిన కరోనా కేసులు

టెహ్రాన్‌: ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదైన పదో దేశంగా ఇరాన్‌ నిలిచింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1680 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 78 మంది  చనిపోయారు. బుధవారం వరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 101,650కు చేరగా..మొత్తం మరణాల సంఖ్య 6,418కు పెరిగింది. సోమవారం నాటికి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన జిల్లాలో మసీదులు తెరిచేందుకు అనుమతిస్తామని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహాని చెప్పారు. 


logo