బుధవారం 27 జనవరి 2021
International - Dec 12, 2020 , 14:50:44

ప్ర‌తిప‌క్ష నేత‌ను ఉరి తీసిన ఇరాన్‌..

ప్ర‌తిప‌క్ష నేత‌ను ఉరి తీసిన ఇరాన్‌..

టెహ్రాన్‌:  మాజీ ప్ర‌తిప‌క్ష నేత రుహోల్లా జామ్‌ను ఇరాన్ దేశం ఉరి తీసింది.  చాన్నాళ్లూ ఫ్రాన్స్‌లో త‌ల‌దాచుకున్న అత‌న్ని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక నిర‌స‌న‌ల కేసులో అరెస్టు చేశారు.  ఇస్లామిక్ రిప‌బ్లిక్ దేశం ప‌ట్ల జామ్ అనేక నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆ దేశ సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.  ఇవాళ ఉద‌యం విప్ల‌వ నేత‌ను ఉరి తీసిన‌ట్లు ఆ దేశ మీడియా పేర్కొన్న‌ది.  గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో రుహోల్లా జామ్‌ను ఇరాన్ రెవ‌ల్యూష‌న‌రీ సైనిక ద‌ళాలు అరెస్టు చేశాయి. ఫ్రాన్స్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఆదేశాల ప్ర‌కారం.. జామ్ అనేక నిర‌స‌న‌ల‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఇరాన్ ఆరోపించింది. తీవ్ర అవినీతి కేసును ఎదుర్కొంటున్న జామ్‌కు గ‌త జూన్‌లోనే ఉరిశిక్ష‌ను ఖ‌రారు చేశారు.  2017 డిసెంబ‌ర్ నుంచి 2018 జ‌న‌వ‌రి వ‌ర‌కు జ‌రిగిన అల్ల‌ర్ల‌లో 25 మంది మృతిచెందారు. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ అమ‌ద్‌న్యూస్ ద్వారా అత‌ను ప్ర‌జ‌ల్ని రెచ్చగొట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  


logo