బుధవారం 03 జూన్ 2020
International - May 01, 2020 , 20:00:50

హెజ్బుల్లాపై నిషేధం ఆక్షేప‌ణీయంః ఇరాన్‌

హెజ్బుల్లాపై నిషేధం ఆక్షేప‌ణీయంః ఇరాన్‌

ఇరాన్ మ‌ద్ద‌తున్న లెబ‌నాన్ సంస్థ హెజ్బుల్లాపై జ‌ర్మ‌నీ నిషేధం విధించ‌టాన్ని ఇరాన్ ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ ప్ర‌యోజ‌నాల కోసమే జ‌ర్మ‌నీ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆరోపించింది. జ‌ర్మ‌నీలో హెజ్బుల్లా మ‌ద్ద‌తు న‌డుస్తున్న మసీదుల్లో గురువారం సోదాలు నిర్వ‌హించిన పోలీసులు ఆ సంస్థ‌ను పూర్తిగా నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఈ సంస్థకు ఉగ్ర‌వాదులతో సంబంధాలు ఉన్నాయ‌ని, దానిని నిషేధించాల‌ని అమెరికా, ఇజ్రాయెల్‌లు ఎప్ప‌టినుంచో అన్ని దేశాల‌ను కోరుతున్నాయి. నిషేధంపై ఇరాన్ విదేశాంగ‌శాఖ ప్ర‌తినిధి అబ్బాస్ ముసావీ శుక్ర‌వారం స్పందిస్తూ కొన్ని యూర‌ప్ దేశాలు ప‌శ్చిమాసియాలో వాస్త‌వ ప‌రిస్థితుల‌ను తెలుసుకోకుండానే త‌‌మ విధానాలు మార్చుకుంటున్నాయి. జియోనిస్టు త‌ప్పుడు ప్రచారం, అమెరికా గంద‌ర‌గోళ ప్రచారాల‌ను న‌మ్మి ఈ నిర్ణ‌యాన్ని వ‌స్తున్నాయి అని పేర్కొన్నారు. హెజ్బుల్లా సంస్థ లెబ‌నాన్‌లో రాజ‌కీయ స్థిర‌త్వం కోసం పాటుప‌డుతున్న‌ద‌ని తెలిపారు.   


logo