మంగళవారం 26 జనవరి 2021
International - Dec 27, 2020 , 19:01:03

ఇరాన్‌లో మంచు తుఫాను.. చనిపోయిన 10 మంది పర్వతారోహకులు

ఇరాన్‌లో మంచు తుఫాను.. చనిపోయిన 10 మంది పర్వతారోహకులు

టెహ్రాన్‌ : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఉత్తరాన ఉన్న పర్వతాలలో మంచు తుఫాను సంభవించింది. ఈ ఘటనలో కనీసం 10 మంది పర్వతారోహకులు మరణించినట్లు, మరెందరో కనిపించకుండా పోయినట్లు అక్కడి మీడియా శనివారం రాత్రి నివేదించింది. ఇద్దరు చనిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. సంబంధిత కుటుంబాలు అధికారులను సంప్రదించడంతో తప్పిపోయిన వారి సంఖ్య తెలుస్తున్నది. తుఫాన్‌ కారణంగా పర్వతంపై తొమ్మిది మంది మరణించగా.. ఒకరిని రక్షించి దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ అత్యవసర ఆపరేషన్ల అధిపతి మెహదీ వాలిపూర్ తెలిపారు. శనివారం రాత్రి పడటంతో అన్వేషణ మానేసి.. తిరిగి ఆదివారం ఉదయం ప్రారంభించారు.

టెహ్రాన్‌కు ఎదురుగా ఉన్న అల్బోర్జ్ పర్వత చైన్‌ యొక్క తోచల్, కోలాచల్ శిఖరాలపై హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చేరుకున్నాయి. చెడు వాతావరణం, మంచు కారణంగా పర్వతంపై కనిపించకుండా పోయినవారిని గుర్తించడం రెస్క్యూ మిషన్ సంక్లిష్టంగా మారింది. టెహ్రాన్ అల్బోర్జ్ పర్వత శ్రేణి పాదాల వద్ద ఉంది. ఇది అనేక స్కీ రిసార్ట్‌లను కలిగి ఉంది. 5,671 మీటర్లు (18,606 అడుగులు) ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉంది. 2017లో సంభవించిన మంచు తుఫాను కారణంగా 11 మంది చనిపోయారు. భారీగా మంచుతో కూడిన గాలులు ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో గందరగోళానికి కారణమయ్యాయి. ఇరానియన్ రవాణా నౌకలోని ఏడుగురు సిబ్బంది కోసం సముద్ర అధికారులు శోధిస్తున్నారని శుక్రవారం అధికారిక వార్తా సంస్థ ఇస్నా తెలిపింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo