శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 28, 2020 , 00:35:44

నడిరోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం

నడిరోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం
  • తప్పిన పెనుప్రమాదం.. ఇద్దరికి గాయాలు

టెహ్రాన్‌: ఇరాన్‌లో మరో విమాన ప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌కు చెందిన క్యాస్పియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన విమానం..144 మంది ప్రయాణికులు, సిబ్బందితో టెహ్రాన్‌ నుంచి బయలుదేరింది. ఉదయం 7.35 గంటలకు ఖుజెస్థాన్‌ ప్రావిన్స్‌లోని మహషహర్‌ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది.  అయితే, ల్యాండ్‌ అయ్యే సమయంలో ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య తలెత్తటంతో.. విమానం విమానాశ్రయం ప్రహరీ గోడను ఢీ కొట్టింది. అదేవేగంతో మహషహర్‌ రహదారి మీదికి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా విమానం కుదుపులకు గురవ్వడంతో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని అధికారులు దవాఖానకు తరలించారు. 


logo