మంగళవారం 26 మే 2020
International - Apr 05, 2020 , 00:45:39

కావాలనే కరోనా అంటించుకున్నా!

కావాలనే కరోనా అంటించుకున్నా!

బెర్లిన్‌: కొందరికి పిచ్చి ముదిరితే ఏమి చేస్తారో వారికే తెలియదు. అలాంటి కోవకే చెందుతారు బెర్లిన్‌ జిల్లా మేయర్‌ స్టీఫెన్‌ వాన్‌ డాసెల్‌. కరోనాతో అందరూ గజగజ వణికిపోతుంటే.. ఈ పెద్దాయన తనలోని వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి కరోనాను కావాలని అంటించుకొన్నాడట. ఈ విషయం ఆయనే చెప్పి ప్రపంచం విస్తుపోయేలా చేశాడు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కొవిడ్‌-19 ఎక్కువగా బాధిస్తుందన్న విషయం తెలుసుకొన్న డాసెల్‌.. తన శరీరంలో ఆ శక్తి ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకొని దాన్ని పెంచుకోవాలని తలపోసాడు. తన భార్య నుంచి కరోనా వైరస్‌ తనకు సోకేలా చేసుకొన్నాడు. అయితే, ఈ వైరస్‌ తాను ఊహించినదానికన్నా దారుణంగా ఉన్నదని డాసెల్‌ చెప్పాడు. 


logo