బుధవారం 03 జూన్ 2020
International - Apr 20, 2020 , 01:26:19

డబ్ల్యూహెచ్‌వోపై దర్యాప్తు జరుగాలి

డబ్ల్యూహెచ్‌వోపై దర్యాప్తు జరుగాలి

  •  ఆస్ట్రేలియా డిమాండ్‌

సిడ్నీ: కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇతర దేశాలు వ్యవహరించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని అస్ట్రేలియా డిమాండ్‌ చేసింది. ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి మారిసి పేనీ మాట్లాడుతూ చైనాలోని వుహాన్‌ నగరంలో తొలుత వైరస్‌ వెలుగులోకి వచ్చినప్పుడు ఆ దేశం వ్యవహరించిన తీరు, వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్న తీరుపై దర్యాప్తు జరిగితే అసలు విషయాలు బయటికి వస్తాయని చెప్పారు. అలాగే డబ్ల్యూహెచ్‌వోపైనా దర్యాప్తు అవసరమని తెలిపారు. ‘వైరస్‌కు సంబంధించిన అన్ని విషయాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయాలు మనకు తెలియాలంటే స్వతంత్ర దర్యాప్తు జరుగాలి’ అని మారిసి పేనీ పేర్కొన్నారు. logo