శనివారం 30 మే 2020
International - Apr 28, 2020 , 10:53:22

చైనాపై ముమ్మ‌ర‌ ద‌ర్యాప్తు జ‌రుగుతోంది:ట్రంప్‌

 చైనాపై ముమ్మ‌ర‌ ద‌ర్యాప్తు జ‌రుగుతోంది:ట్రంప్‌

వాషింగ్ట‌న్: కరోనా వైరస్ విష‌యంలో‌ చైనాపై ఆగ్ర‌హంగా అమెరికా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సిద్ద‌మవుతోంది. ఇందుకు స‌మ‌గ్ర‌మైన‌‌ ద‌ర్యాప్తు చేస్తామ‌ని ఇప్ప‌టికే అమెరికా ప్ర‌కటించగా..దీనిని చైనా ఖండించింది. ద‌ర్యాప్తుకు తాము అంగీక‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. తాము కూడా క‌రోనాకు బాధితుల‌మేన‌ని చెప్పుకొచ్చింది. కాని ఈ విష‌యంలో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా ద‌ర్తాప్తు చేప‌డ‌తామ‌ని..వెన‌క్కి త‌గ్గే ప్ర‌సక్తే లేద‌ని తేల్చిచెప్పింది. ఇందుకు చైనా పాత్ర‌పై ముమ్ముర ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. చైనా బాధ్యుల‌ని చేయ‌డానికి త‌మ ద‌గ్గ‌ర చాలా మార్గాలున్నాయ‌ని అమెరికా చెపుతోంది. క‌రోనాతో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం భారీగా జ‌రిగింద‌ని పేర్కొంది. ఈ విష‌యంలోజ‌ర్మ‌నీ అడుగుతున్న 130 బిలియ‌న్ యూరోల కంటే ఎక్కువ‌నే చైనా నుంచి రాబ‌ట్టేందుకు యోచిస్తున్నామ‌ని తెలిపింది.


logo