మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 06, 2020 , 17:33:15

పిల్లి ఫీల్డింగ్‌.. వ‌న్ బై వ‌న్‌! ఒక‌టి కూడా మిస్ అవ్వ‌లేదు

పిల్లి ఫీల్డింగ్‌.. వ‌న్ బై వ‌న్‌! ఒక‌టి కూడా మిస్ అవ్వ‌లేదు

కుక్క‌లు నోటిని ఉప‌యోగించి బంతిని క్యాచ్ ప‌ట్టుకుంటాయి. కానీ పిల్లి త‌న ముందు భాగంలో ఉన్న‌ రెండు పాదాల‌ను ఉప‌యోగించి బంతిని క్యాచ్ ప‌ట్టుకోవ‌డం ఎప్పుడైనా చూశారా? ఈ వీడియోలో ఆ పిల్లి నైపుణ్యాలు నెటిజ‌న్ల‌ను అబ్బుర‌ప‌రుస్తున్నాయి. ఈ వీడియోను ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డీన్ జోన్స్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 'నేను చాలామంది చెత్త ఫీల్డ‌ర్ల‌ను చూశాను. నేను మీకు భ‌రోసా ఇవ్వ‌గ‌ల‌ను' అనే శీర్షిక‌ను జోడించారు.

వీడియోలో చూసిన‌ట్ల‌యితే ఒక అమ్మాయి గోల్ఫ్‌స్టిక్ ప‌ట్టుకొని బంతుల‌ను ఒక్కొక్క‌టిగా పిల్లి వైపు కొడుతున్న‌ది. చిన్న గోల్ పోస్ట్ ముందు పిల్లి నిల‌బ‌డి ఉంది. అయితే ఆమె కొట్టిన‌ ప్ర‌తి బంతిని పిల్లి శిక్ష‌ణ తీసుకున్న ట్రైన‌ర్‌లా భ‌లే క్యాచ్ ప‌ట్టేసింది. 30 సెకండ్ల వీడియోలో మూడు బంతుల‌ను కొట్టిందామె. ఆ మూడింటినీ ఒక‌టి కూడా మిస్ అవ్వ‌కుండా క్యాచ్ ప‌ట్టేసింది. అంత‌టి నైపుణ్యం క‌లిగిన పిల్లిని ఒలింపిక్స్‌కు పంపిస్తే మంచి పేరు తీసుకొస్తుందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వీడియోను 152.2 కే మంది వీక్షించారు. 

   


logo